చైనా-భారత్ సరిహద్దుల్లో పర్యటించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
- October 08, 2017
అసలే.. చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సరిహద్దుల్లో పర్యటించారు దేశ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్. సాధారణంగా ఇలాంటి పర్యటనలపై భగ్గుమంటుంది చైనా ప్రభుత్వం. కానీ.. సీతారామన్ మాత్రం.. సరిహద్దుల్లో టెన్షన్‌ను తగ్గించడం కోసం.. ఈ టూర్‌లో తనదైన మార్క్‌ను చూపించారు.
రెండు దేశాలకు కీలకమైన నాథు లా పాస్ దగ్గర సైనికాధికారులతో సమావేశమై.. సరిహద్దుల్లో మోహరింపుపై ఆరా తీశారు. ఇదే సమయంలో.. చైనా భూభాగం నుంచి ఆ దేశ సైనికులు సీతారామన్‌ను ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ఆమె... చేయి ఊపుతూ.. వారిని పలకరించారు.
ఆ తర్వాత.. భారత సైనికాధికారులతో కలిసి.. చైనా సైనికాధికారులను కలుసుకున్నారు రక్షణమంత్రి. వారికి నమస్తే చెప్పారు.. నమస్తే అంటే అర్థం చెప్పి.. అక్కడున్న ప్రతీ ఒక్కరితో నమస్తే పెట్టించారు. ఇలా గతంలో ఏ రక్షణ మంత్రి నేరుగా సరిహద్దుల్లో చైనా సైనికులతో చర్చించిన సందర్భాలు లేవు. నిర్మలా యాక్షన్‌కు కూల్ అయిపోయారు చైనా భద్రతా సిబ్బంది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ.. సీతారామన్ ఆ దేశ సైనికులతో సరదాగా ముచ్చటించడం వల్ల.. ఉద్రిక్తతలు తగ్గుతాయన్న వాదన వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









