హెల్త్‌ కేర్‌ : 15 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ కేటాయింపు

- October 08, 2017 , by Maagulf
హెల్త్‌ కేర్‌ : 15 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ కేటాయింపు

మనామాం ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, 2017 మిగిలిన కాలానికిగాను 15 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ని హెల్త్‌ మినిస్ట్రీ బడ్జెట్‌కి కేటాయించాల్సిందిగా సూచించారు. మెడిసిన్స్‌ అలాగే మెడికల్‌ ఎక్విప్‌మెంట్స్‌ కోసం వీటిని వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌తో అనుబంధంగా ఉన్న హెల్త్‌ సెంటర్స్‌, హాస్పిటల్స్‌కి ఈ నిధులు అందుతాయని మినిస్ట్రీ పేర్కొంది. హెల్త్‌ మినిస్టర్‌ ఫయీకా బింట్‌ సౌద్‌ అల్‌ సలెహ్‌ మాట్లాడుతూ, ప్రైమ్‌ మినిస్టర్‌ నిధుల విడుదలపై చేసిన సూచన పట్ల హర్షం వ్యక్తం చేశారు. హెల్త్‌ సర్వీసెస్‌ రంగంలో చాలా సవాళ్ళున్నాయనీ, వాటిని అందుకునేందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడ్తాయని మినిస్టర్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com