గోల్డ్ బాండ్స్ వచ్చేస్తున్నాయి

- November 03, 2015 , by Maagulf
గోల్డ్ బాండ్స్ వచ్చేస్తున్నాయి

గోల్డ్ బాండ్స్ వచ్చేస్తున్నాయి. ఇక మీరు మీ పెట్టుబడిని బంగారంపై నేరుగా కాకుండా బ్యాంక్‌లో బాండ్ రూపంలో పెట్టుకోవచ్చు. ఈనెల అయిదో తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్డ్ బాండ్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ బాండ్లను మాత్రం ఈనెల 26న ఇష్యూ చేస్తారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గోల్డ్ బాండ్ రూపంలో కస్టమర్లు రెండు గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం కనీస పెట్టుబడి 5వేల రూపాయలు ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్లను ఆర్‌బీఐ జారీ చేస్తుంది. నిర్ధిష్ట డినామినేషన్‌లో బాండ్లు ప్రింట్ చేసి వాటిని బంగారం ధరతో లింక్ చేస్తారు. ఒకవేళ బంగారం ధర పెరిగితే..బాండ్ విలువ కూడా పెరుగుతుంది. ఇది కస్టమర్‌కు చాలా ఉపయోగపడుతుంది. బ్యాంక్‌లో నేరుగా బంగారాన్ని పెట్టుబడి పెట్టే కస్టమర్లకు మాత్రం దానిపై 2.75 శాతం (ఆర్నెళ్లకు)వడ్డీ ఇస్తారు. డిఫార్మాట్ రూపంలో గోల్డ్ బాండ్స్ లభ్యమవుతాయి. మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిదేళ్లు ఉంటుంది. ఒకవేళ కస్టమర్లు కావాలంటే అయిదేళ్ల తర్వాత బాండ్లను బ్రేక్ చేయవచ్చు. బ్యాంక్‌లు, పోస్ట్ ఆఫీసుల ద్వారా గోల్డ్ బాండ్స్ అమ్ముతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com