ఎయిర్ బెలూన్ల ద్వారా ప్రాజెక్ట్ లూన్
- November 03, 2015
సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్‌తో మరోసారి తన శక్తిసామర్థ్యాలను చాటనుంది. గాలిలో ఎగిరే ఎయిర్ బెలూన్ల ద్వారా భారత్‌లోని వినియోగదారులకు ఇంటర్నెట్‌ను అందించేందుకు సిద్ధమైంది. 'ప్రాజెక్ట్ లూన్' పేరిట గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకురానున్న ఈ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిపి అందించనుంది. న్యూజిలాండ్, యూఎస్‌ఏ కాలిఫోర్నియా, బ్రెజిల్ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించగా మన దగ్గర అతి త్వరలోనే ఇవి ప్రారంభం కానున్నాయి. భూమి ఉపరితలానికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ ఆయా డివైస్‌లకు ఈ బెలూన్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. 4జీ టెక్నాలజీకి సరిసమానంగా ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. తన చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 4జీ డివైస్‌లకు బెలూన్లు కమ్యూనికేట్ అవుతాయి. సౌరశక్తిని ఉపయోగించుకుంటూ ఈ బెలూన్లు సొంతంగా విద్యుత్‌ను తయారు చేసుకుని అదే శక్తిని తన పనుల కోసం వినియోగించుకుంటాయి. వీటి ద్వారా ఏ ప్రదేశంలోనైనా అత్యధిక వేగంతో కూడిన 4జీ సేవలను వినియోగదారులు పొందేందుకు వీలుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. 'ప్రాజెక్ట్ లూన్' సేవలను మరింత విస్తృతం చేయడానికి ఇతర టెలిఫోన్ ఆపరేటర్లతో కూడా గూగుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







