వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు
- November 03, 2015
నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం నల్గగొండ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న అనురాగ్ శర్మ జిల్లాలో 30 పుష్కరఘాట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలో అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో తెలంగాణలో ఎక్కడ ఏటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







