మిస్ వీల్‌చైర్‌గా బెలారస్ సుందరి చిచికోవా
- October 09, 2017
అందం అనేది శరీరానికి సంబంధించినదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చిన్న లోపమున్నా తాము అందంగా లేమని బాధపడేవారు ఎందరో. ఇక వికలాంగుల్లో చాలామంది తమ లోపాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతారు. కానీ.. అందం అనేది అవయవాలకు సంబంధించినది కాదని, మనసు సంబంధించినదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అలెగ్జాండ్రా చిచికోవా. వీల్‌చైర్‌కు పరిమితమైన 23 ఏళ్ల చిచికోవా.. అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మిస్ వీల్‌చైర్ కిరీటాన్ని దక్కించుకుంది.
వార్సాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా తన పేరును ప్రకటించిన వెంటనే తీవ్ర ఉధ్వేగానికి లోనైన చిచికోవా.. కాసేపటి తేరుకొని మీడియాతో మాట్లాడింది. ‘మీలోని అపోహలు, భయాలతో పోరాడండి’ అంటూ ఒకే ఒక్కమాట చెప్పి అందరి మనసులు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన లెబొహాంగ్ మొన్యాట్సీ, పొలాండ్‌కు చెందిన ఆండ్రియన్నా జవాడ్జిన్స్కా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







