పెను ప్రమాదాన్ని తప్పించిన సాహసవీరుడు
- October 10, 2017
దుబాయ్: పెట్రోల్ పంప్‌కి దగ్గర్లో ఓ కారు తగలబడిపోతుండడాన్ని గమనించిన ఓ వ్యక్తి తన ఎస్‌యూవీతో కాలుతున్న ఆ కారుని దూరంగా నెట్టివేశాడు. పెట్రోల్ పంప్‌కి సేఫ్ డిస్టెన్స్ వరకూ అలా తోసుకుంటూ వెళ్ళిన ఆ వ్యక్తి, చాకచక్యంగా తన కారుని రివర్స్ చేయగలిగాడు. అయితే అప్పటికే అతని ఎస్‌యూవీకి కొంత మేర మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఆ మంటల్ని ఆర్పివేయడం జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకెందుకులే అన్న భావన అందరిలో ఉంటుంది. ముందుగా తమని తాము రక్షించుకోవడానికి చూస్తారెవరైనా. పెట్రోల్ పంప్‌కి అగ్ని ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆలోచనతో ఆ ఎస్‌యూవీ నడుపుతున్న వ్యక్తి, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







