విశాఖకు ఐటీ కంపెనీలు కష్టమే: ఐటీ మంత్రి లోకేశ్
- October 10, 2017
‘విశాఖపట్నంలో సోషల్ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీల వారు సిద్ధంగా లేరు’ అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానిక కోటా కుదరదన్నారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ ముందుకు రావని చెప్పారు.
విశాఖలో 2014కి ముందు కేటాయించిన స్థలాల్లో కొన్ని ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదని, వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్ యూనిట్ల ఏర్పాటులో తిరుపతి క్లస్టర్‌పై ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారని, సెల్‌ఫోన్ల తయారీ క్లస్టర్‌గా తిరుపతి అభివృద్ధి చెందుతోందన్నారు. కాగా, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సదస్సు మంగళవారం ముగిసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







