పొగాకు ఉత్పత్తులకు మ్యాండేటరీ స్టాండర్డ్స్‌

- October 14, 2017 , by Maagulf
పొగాకు ఉత్పత్తులకు మ్యాండేటరీ స్టాండర్డ్స్‌

ది ఎమిరేట్స్‌ స్టాండర్‌డైజేషన్‌ అండ్‌ మెట్రాలజీ అథారిటీ ఎస్మా, దోఖా టొబాకో ప్రోడక్ట్స్‌కి సంబంధించి మ్యాండేటరీ స్టాండర్డ్స్‌ని ఖరారు చేసింది. పొగాకులో రకరకాలైన హెర్బల్స్‌, స్పైసెస్‌ని కలిసి మెద్వాక్‌లో వినియోగిస్తున్న దరిమిలా, ఈ తరహా ట్రేడ్‌కి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధనల్ని తెరపైకి తెచ్చారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎస్మా అబ్దుల్‌ ఖాదెర్‌ అల్‌ మీని మాట్లాడుతూ, ఇప్పటికే డ్రాఫ్ట్‌ ద్వారా విధి విధానాల్ని సంబంధిత శాఖలకు పంపించామని తెలిపారు. డోకా టొబాకో స్టోర్స్‌కి సంబంధించి తనిఖీలు జరుగుతాయనీ, ఇందులో హానికారకమైన పదార్థాల్ని మిక్స్‌ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షిషాస్‌, సిగరెట్స్‌, ఇతర రకాలుగా ఉపయోగించే వాటికి సంబంధించిన నిబంధనలను ఎవరూ అతిక్రమించరాదని అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com