వాహనాల తయారీ సంస్థ టెస్లాలో 400 ఉద్యోగాలకు చెక్...
- October 14, 2017
ప్రముఖ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ టెస్లా తన కంపెనీలో పనిచేస్తున్న సుమారు 400మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో అసోసియేట్స్, బృంద నాయకులు, సూపర్‌వైజర్లు ఉన్నారని ఓ మాజీ ఉద్యోగి వెల్లడించారు. వార్షిక సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్న టెస్లా.. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా ప్రకటన వెలువరించింది. అయితే సంస్థ నుంచి ఎంతమందిని తొలగిస్తున్నదీ మాత్రం పేర్కొనలేదు. 'సుమారు 400 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించారు. ఇందులో అసోసియేట్స్ నుంచి టీమ్ లీడర్లు, సూపర్‌వైజర్ల వరకూ ఉన్నారు. అయితే వీరంతా ఎప్పుడు సంస్థను వీడతారనేది మాత్రం తెలియదు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. అయితే టెస్లా మాత్రం ప్రతిభ ఆధారంగా చేసుకొని ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







