ఎల్బీ స్టేడియంలో పోలీస్ శాఖకు చెందిన ఎక్స్పో
- October 14, 2017
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఎక్స్పో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనువిందు చేస్తోంది. పోలీసుల సంస్మరణ దినం నేపథ్యంలో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ప్రతీ ఏటా 21న జరుపుకునే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో వారి త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఎక్స్పోను హోంమంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి ప్రారంభించారు.
డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్‌తోపాటు 21 విభాగాల స్టాల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. ఎక్స్పో ప్రారంభంలో ట్రైనింగ్ లో ఉన్న ఫస్ట్ బెటాలియన్, 8వ బెటాలియన్ కానిస్టేబుళ్లు చేసిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. దీంతో పాటు సైబరాబాద్ టాకిటాల్ టీమ్ చేసిన విన్యాసాలు, ఆత్మరక్షణతోపాటు.. క్రిమినల్స్‌ని ఎలా పట్టుకుంటారో అనేదానిపై డెమో నిర్వహించారు. వివిధ రకాల ఆయుధాలతో చేపట్టిన ఎగ్జిబిషన్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంది. చిన్న చిన్న పిస్టల్స్ దగ్గర్నుంచి మెషీన్ గన్ల వరకు అన్ని రకాల ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు. సెక్యూరిటీ సిస్టమ్స్, సీక్రెట్ కెమెరా వ్యవస్థలతోపాటు రాకెట్ లాంచర్లు, రకరకాల మెషీన్ గన్లు ఎలా పనిచేస్తాయో వివరించారు. సీఆర్పీఎఫ్ ఉపయోగించే అధునాతన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉంచారు. అంతకు ముందుకు ఎక్స్పో ప్రారంభించిన హోంమంత్రి స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతీ సంవత్సరం జరుపుకునే సంస్మరణ దినోత్సవంతో పోలీస్ సేవలు ప్రజల్లోకి వెళతాయన్నారు. మూడు రోజుల పాటు ఎక్స్పో జరుగుతుంది. ఎక్స్పో జరిగే అన్ని రోజులు నగరవాసులకు అనుమతినిస్తారు పోలీసులు. దీంతోపాటు రేపు 2కే, 5కే, 10కే రన్లను ఏర్పాటు చేయనున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







