కృష్ణకు ఇందిరాగాంధీ పురస్కారం

- October 14, 2017 , by Maagulf
కృష్ణకు ఇందిరాగాంధీ పురస్కారం

న్యూఢిల్లీ: జాతీయ సమైక్యతకు పాటుపడిన వారికి అందజేసే ఇందిరాగాంధీ పురస్కారం ఈసారి (2015-16 సంవత్సరాలకు) కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయకుడు టిఎం కృష్ణను వరించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి రోజయిన ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అవార్డును కృష్ణకు బహూకరించనున్నారు. దేశంలో జాతీయ సమైక్యతను పరిరక్షించటంలో, పెంపొందించటంలో విశేష కృషి చేసిన టిఎం కృష్ణను 2015, 2016 సంవత్సరాలకు గాను 30వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఈ అవార్డు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతిలో సామాజిక ఐక్యతను సాధించినందుకు కృష్ణను గతంలో రామన్ మెగసెసే అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ పురస్కారం కింద కృష్ణకు రూ. పది లక్షల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. కృష్ణ భారతీయ శాస్ర్తియ సంగీతంలోని కర్ణాటక సంప్రదాయంలో ప్రముఖ గాయకుడే కాకుండా పేరుమోసిన సామాజిక కార్యకర్త కూడా. కాలమిస్టు కూడా అయిన కృష్ణ అనేక సామాజిక-రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వివిధ వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com