వాతావరణ హెచ్చరిక.!
- October 15, 2017
వాతావరణ హెచ్చరిక. మరో ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న 24 గంటల్లో.. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. ఆ వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 19 నాటికి ఉత్తర కోస్తాంధ్ర - ఒడిశాల మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 5 రోజులంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







