అక్టోబర్ 23న విడుదలకానున్న ఆక్సిజన్ ఆడియో.!
- October 15, 2017
మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆక్సిజన్ సినిమా ఆడియోను ఈ నెల 23న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళ స్టార్ మ్యూజీషియన్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత మందించారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో జగపతిబాబు మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







