హఫీజ్ సయీద్ పై ఉగ్రవాద చార్జీలు ఉపసంహరించుకున్న పాక్ గవర్నమెంట్

- October 15, 2017 , by Maagulf
హఫీజ్ సయీద్ పై ఉగ్రవాద చార్జీలు ఉపసంహరించుకున్న పాక్ గవర్నమెంట్

పాకిస్థాన్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవ(జేయూడీ )చీఫ్ హఫీజ్ సయీద్ పై టెర్రరిజం అభియోగాలను ఉఫసంహరించుకుంది. ఈ మేరకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం పాకిస్థాన్ సుప్రీం కోర్టు రివ్యూ బోర్డుకు ఈ రోజు తెలియజేసింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను ఉగ్ర వాద అభియోగాలపై గత కొంత కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నేడు ఆ అభియోగాలను ఉపసంహరించుకోవడంతో హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విముక్తుడు కావడానికి మార్గం సుగమమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com