నవంబర్ 1 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
- October 15, 2017
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి సువర్ణవకాశం. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంగా 31 జిల్లాల అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్ మెంట్ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్మన్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత 16 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాలీకి వచ్చే సమయంలో ఈ అడ్మిట్ కార్డులను తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







