రెండింతలు పెరిగిన పసిడి దిగుమతులు
- October 15, 2017
న్యూదిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో బంగారం దిగుమతులు రెండింతలు పెరగడం ద్వారా 16.95 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతాలోటుకు దారితీస్తున్నాయి. 2016-17 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో దిగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ముగిసిన నెలలో పసిడి దిగుమతులు 5శాతం మేర తగ్గడం ద్వారా 1.80 బిలియన్ డాలర్ల నుంచి 1.71బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీంతో దేశీయ కరెంటు ఖాతా లోటు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’







