యూఏఈ లో మతం అవమానించిన వ్యక్తి : పోలీసు నిర్బంధంలో ఆత్మహత్యయత్నం

- October 15, 2017 , by Maagulf
యూఏఈ లో మతం అవమానించిన వ్యక్తి : పోలీసు నిర్బంధంలో ఆత్మహత్యయత్నం

యుఎఇ: సందర్శన వీసా పై వచ్చిన ఓ వ్యక్తి వివాదంలో ఇరుక్కున్నాడు. కోర్టు విచారణలో దోషిగా తేలడంతో,  మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడినందుకు కోర్టు జైలు శిక్ష అనుభవించిన తరువాత 5,000 దిర్హామ్ ల మొత్తాన్నీ జరిమానా చెల్లించాలని ఆ 28 ఏళ్ల జోర్డానియన్ వ్యక్తికి  కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఆదేశించింది. జూలై 3 న, ఆ వ్యక్తి లైసెన్సు లేకుండా మద్యం సేవించడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆ వ్యక్తిని దోషిగా గుర్తించారు మరియు రాత్రి 9:30 గంటల సమయంలో  పోలీసులు తమ అదుపులోనికి  తీసుకున్నారు. మద్యం ప్రభావంతో, ప్రతివాది తీవ్రంగా ప్రవర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డులు చూపించాయి. చట్టపరమైన విధానాల పెండింగ్ లో ఉంచి ఆ వ్యక్తిని నిర్బంధంలో ఉంచబడ్డాడు. నిర్బంధంలో ఉండగా, ఆ వ్యక్తి తన జీవితాన్ని  అంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతని పర్సులో దాచి ఉంచిన ఒక బ్లేడ్ తీసుకొని  తనంతట తానె ఒక బ్లేడును తీసుకొని కోసుకున్నాడు. వెంటనే పారామెడిక్స్ సిబ్బంది నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి హింసాత్మకంగా మారనివ్వలేదు. ఉగ్రమైన మరియు మత్తులో ఉన్న పరిస్థితిలో ఆ వ్యక్తి మతంను అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను అజ్మాన్ లో మద్యం సేవించాడని విచారణ సమయంలో ఒప్పుకున్నాడు. కానీ అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు లేదా మౌలిక స్థితిలో మాట్లాడినప్పుడు తప్పుడు  భాషను ఉపయోగించలేదని నిరాకరించాడు. ఆ వ్యక్తిని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారని  అనే ప్రశ్నకు అధికారుల దృష్టిని ఆకర్షించాలని మాత్రమే ఆ వ్యక్తి  కోరుకున్నాడు. ఒక పోలీసు అధికారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com