ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం
- October 16, 2017
ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రెండో అంతస్తులోని రూమ్ నెం. 242లో ఉదయం 3.35 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన పీఎంవో సిబ్బంది.. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. పీఎంవో వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ఈ సందర్భంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గుర్ముఖ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమకు మంగళవారం ఉదయం 3.35 గంటల సమయంలో.. పీఎంవోలో అగ్నిప్రమాదం జరిగినట్లు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో హుటాహుటిన పీఎంవో వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







