'సాహో' లో స్టైలిష్లుక్తో అదరగొడుతున్న బాహుబలి
- October 16, 2017
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫుల్ స్టైలిష్లుక్ లోకి మారిపోతున్నాడు.. ఈ నేపద్యంలో ప్రభాస్ కు సంబంధించిన అనేక ఫోటోలు బయటకు వచ్చి... ఇదే సాహో లో ప్రభాస్ లుక్ అంటూ వార్తలు చోటు చేసుకొంటున్నారు.. కాగా తాజాగా ప్రభాస్ కు సంబంధించిన మరో కొత్త లుక్ బయటకు వచ్చింది. ఈ లుక్ లో ప్రభాస్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు. జేబులో చేతులు పెట్టుకొని, తెలుపు రంగు గళ్ళ చొక్కా ధరించి చిరునవ్వులు చిందిస్తూ.. మంచి స్టైలిష్గా ప్రభాస్ ఈ పిక్ లో కనిపిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ యూనిక్ గా కనిపించడానికి స్పెషల్ ట్రైనర్ ని కూడా పెట్టుకున్నాడు.. కథకు పర్ఫెక్ట్ గా నప్పేలా తనని తాను మలచుకున్నాడు. బాహుబలి సినిమా కోసం పెంచిన కండలు.. బరువు తగ్గించుకొని సాహో షూటింగ్ కు రెడీ అయ్యాడు. ప్రభాస్ తో తొలిసారిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకొన్న ప్రభాస్ కు సాహో మరి ఎంతటి హిట్ ఇస్తుందో చూడాలి మరి..
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







