నావంబెర్ లో విడుదలకు సిద్ధం అవుతున్న 'దండుపాళ్యం-3'
- October 17, 2017
బొమ్మాళి ఫేమ్ రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్లను వసూళ్లు చేసిన సంగతి తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవలే 'దండుపాళ్యం2' కూడా వచ్చింది. కాకపోతే మొదటి పార్ట్ సాధించినంత విజయం సెకండ్ పార్ట్ సాధించలేకపోయింది. అయినాగానీ ఇప్పుడు తాజాగా 'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా 'దండుపాళ్యం-3' రాబోతుందని ప్రకటించారు చిత్ర యూనిట్.
ఇప్పటికే షూటింగ్ అంత పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలిపి దానికి సంబదించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. శ్రీనివాస రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందిస్తుండగా రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మూడో పార్ట్ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







