బంగ్లాదేశీయులకి ఎమిరేట్స్ 4 రోజుల యూఏఈ వీసా
- October 18, 2017
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ఎకానమీ క్లాస్ య్రాణీకులకు 96 గంటల యూఏఈ వీసాని అందించేందుకు ముందుకొచ్చింది. ఢాకా నుంచి ఆఫ్రికా, కెనడా, యూరోప్ లేదా అమెరికాలోని డెస్టినేషన్స్ కోసం వీసా సౌకర్యాన్ని కల్పించనుంది. బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్ సర్వీస్ ప్రయాణీకులకు రెండు రాత్రుల స్టేని జెడబ్ల్యు మారియట్ మార్కిస్ దుబాయ్‌లో కల్పించనుండడం మరో ఆఫర్‌గా చెప్పుకోవాలి. కాంప్లిమెంటరీ వీసా సౌకర్యానికి ఇది అదనమని ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 22 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్యలో ప్రయాణీకులు తమ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఔట్ బౌండ్ లేదా ఇన్ బౌండ్కి డైరెక్షన్లో ఒకే ఒక్క స్టాపోవర్ని అనుమతిస్తారు. నవంబర్ 30 నాటికి స్టాపోవర్ అందుబాటులో ఉండాలి.
తాజా వార్తలు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!









