రష్యా విమానంలో బాంబు పేలడం వల్ల విమానం కూలినట్లు అనుమానం

- November 05, 2015 , by Maagulf
రష్యా విమానంలో బాంబు పేలడం వల్ల విమానం కూలినట్లు అనుమానం

బాంబు పేలడం వల్ల ఈజిప్టులో రష్యా విమానం నేలకూలినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. సినాయ్‌లో జరిగిన దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు మరణించారు. ప్లేన్‌లో బాంబు పేలడం వల్లే విమానం ముక్కలైనట్లు అమెరికా, బ్రిటన్‌కు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు. షర్మ్-ఎల్-షేక్‌కు వెళ్లే విమానాలను బ్రిటన్ రద్దు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులే ఆ బాంబును ప్లేన్‌లో అమర్చినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. బాంబును విమానంలోకి తీసుకెళ్లేందుకు పోయిర్‌పోర్ట్‌లో ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com