పాక్ మాజీప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్.!
- October 19, 2017
పాకిస్థాన్ పదవీచ్యుత అధ్యక్షుడు నవాజ్ షరీఫ్, ఆయన కూతురు, అల్లుడికి షాక్ తగిలింది. అవినీతి కేసులో వారిపై నమోదైన నేరాభియోగాలను ఖరారు చేస్తూ.. ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది.
67 ఏళ్ల షరీఫ్, ఆయన కూతురు మరియమ్ నవాజ్, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ మహమ్మద్ సఫ్దార్‌లకు లండన్‌లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ జాతీయ జవాబుదారీ బ్యూరో (ఎన్ఏబీ) అభియోగాలు మోపింది. ఈ అభియోగాలను ఖరారుచేస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. షరీఫ్, ఆయన తరఫు న్యాయవాది ఖవాజ హారిస్ దేశంలో లేని సమయంలో ఈ కీలక ఆదేశాలు వెలువడటం గమనార్హం.
తమకు లండన్‌లో అక్రమాస్తులు లేవని, తమపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా కోర్టు ఇండిక్ట్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను వాయిదా వేయాలంటూ సఫ్దార్ తరఫు న్యాయవాది అంజద్ పర్వేజ్ కోరారు. వీరి అభ్యర్థనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
షరీఫ్, ఆయన కుటుంబసభ్యులపై ఎన్ఏబీ ఇప్పటికే పలు అవినీతి కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ షరీఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించకముందే.. ఈ మేరకు గట్టి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. ఈ అవినీతి ఆరోపణల కారణంగా ఆయన ఇటీవల ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







