యు. ఏ . ఈ. కొత్త వీసా ప్రక్రియలో మినహాయింపులు లేవు

- November 05, 2015 , by Maagulf
యు. ఏ . ఈ.  కొత్త వీసా ప్రక్రియలో మినహాయింపులు లేవు

 

ఈ నవంబరు 15 నుండి యు. ఏ . ఈ. లో  కొత్త వీసా ప్రక్రియలో ఎవ్వరికీ  మినహాయింపులు ఉండబోవని  జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్(GDRFA) వారు స్పష్టం చేసారు. వారు గత నెల వీసా లావాదేవీల  ప్రక్రియ కోసం కొత్త ప్రక్రియను ప్రవేసపెట్టిన సంగతి విదితమే. యు. ఏ . ఈ., జి. సి.సి. దేశీయుల కోసం 'విజన్' అనే పేరుగల అందరు కొత్త దరఖాస్తుదారులు తమ అసలు సర్టిఫికెట్లను స్కానింగ్ కోసం సమర్పించ వలసి ఉంటుందని, ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లో ఉన్నామని, నవంబర్ 15 నుండి ఇది తప్పనిసరి కాబోతోందని, పాత మరియు పరిశీలనలో ఉన్న దరఖాస్తు లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ కొత్త దరఖాస్తు దారులు తమ అసలు పత్రాలను స్కానింగ్ కై సమర్పించవలసి ఉంటుందని, వారు వీసా దరఖాస్తుల కోసం టైపింగ్ సెంటర్లకు వెళ్ళినపుడు ఈ కింది పత్రాలను వెంట తీసుకు వెళ్లాలని వారు సలహా ఇచ్చారు:స్పాన్సరర్   యొక్క ఒరిజినల్ పాస్ పోర్టు మరియు ఎమిరేట్స్ ఐ. డి. ,.స్పాన్సర్  చేయబడుతున్న వారి యొక్క ఒరిజినల్ పాస్ పోర్టు మరియు ఎమిరేట్స్ ఐ. డి., స్పాన్సర్  చేయబడుతున్న వారి యొక్క కలర్ ఫోటో - తెలుపు బ్యాక్ గ్రౌండ్ లో, లేబర్ కాంట్రాక్ట్, లేబర్ కార్డు, ప్రైవేటు రంగంలో ఉన్న వారికీ శాలరీ లెటర్, ఫ్రీ జోన్, గవర్నమెంట్, స్పాన్సర్ పార్టనర్ లేదా ఇన్వెస్టర్ ఐనట్లితే -ట్రేడ్ లైసెన్స్, ఒరిజినల్ టెనేన్సీ కాంట్రాక్ట్, వర్తించే వారికీ జనన మరియు వివాహ సర్టిఫికెట్లు, మరియు స్పాన్సర్ యొక్క IBAN నంబరు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com