మ్లేఇహా రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లింపు పని ఆదివారం నుండి ప్రారంభం

- October 20, 2017 , by Maagulf
మ్లేఇహా రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లింపు పని  ఆదివారం నుండి ప్రారంభం

షార్జా  : స్థానిక ఆల్ సుయోహ్ ప్రాంతంలో మ్లేఇహా రోడ్డు వద్ద  అక్టోబరు 22 వ తేదీ ఆదివారం (రేపు) నుంచి  ట్రాఫిక్ మళ్ళింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాణాలు మరియు అభివృద్ధి మంత్రిత్వశాఖ శుక్రవారం సాయంత్రం ధృవీకరించింది. మ్లేఇహా రోడ్డు నుంచి మూడు మార్గాలు మరియు  షార్జా వైపుగా రెండు మార్గాలుగా మళ్లించనున్నారు. 174 లక్షల ధిర్హాంల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్  2018 మొదటి త్రైమాసికంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. గౌరవనీయ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్  చూపిన చొరవతో ఈ అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి కాబడితే  ట్రాఫిక్ రద్దీ మరియు వాహనాల గందరగోళాన్ని తగ్గించడమే ఈ విస్తరణ లక్ష్యంగా ఉంటుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ రోడ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ హమ్మాడి తెలిపారు. రహదారిపై ప్రయాణించడంలో డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.  ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత రహదారి కొరకు పునర్నిర్మాణ పనులను చేపట్టింది.  ప్రతి దిశలో మూడు దారులు  విస్తరణను కలిగి ఉంది. షార్జా నుంచి దుబాయ్ వరకు 42 కిలోమీటర్ల రహదారికి మూడో మార్గం ఉంది. మూడో భాగం ఎమిరేట్స్ మరియు మెలైహా రోడ్డుపై ప్రస్తుత వంతెన మీదుగా మూడు నుండి ఏడు మార్గాల వరకు విస్తరించింది. యుఎఇలో పౌరులు మరియు నివాసితులకు ఆనందం యొక్క అత్యధిక సూచికలను సాధించేందుకు రహదారి ప్రాజెక్టులతో సహా పలు ప్రాజెక్టులను మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరుగుతుందని తద్వారా ఇవన్నీ యుఎఇ జాతీయ విధానానికి సంపూర్ణ  మద్దతునిచ్చేవని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com