భారతీయ ముస్లింలకు అల్లాని తప్ప వేరే దేవుళ్లను ఆరాధిస్తే... మరో ఫత్వా జారీ!
- October 21, 2017
సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల సంచలన ఫత్వా వెలువరించిన ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్... తాజాగా భారతీయ ముస్లింలకు మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం పురుషులు, మహిళలు అల్లాని తప్ప మరే ఇతర దేవుళ్లను ఆరాధించరాదని స్పష్టం చేసింది. ''అల్లాని తప్ప ఎవరైనా ఇతర దేవుళ్లను ఆరాధిస్తే.. వాళ్లు ముస్లింలుగా ఉండబోరు..'' అని దారుల్ ఉలూమ్ దియోబంద్ పేర్కొంది. కొందరు ముస్లిం మహిళలు దీపావళి సందర్భంగా వారణాసిలో హారతి ఇచ్చిన నేపథ్యంలోనే... శనివారం సదరు ముస్లిం సంస్థ ఈ ఫత్వా జారీ చేయడం గమనార్హం.
కాగా ముస్లిం మహిళలు కనుబొమ్మలను పీకడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, మంచి షేప్ వచ్చేలా తీర్చిదిద్దుకోవడం పైనా ఈ నెల మొదట్లో దారుల్ ఉలూమ్ ఫత్వా జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ముస్లిం మహిళలు కనుబొమ్మలు పీకడం, జుట్టు కత్తిరించుకోవడం సహా మొత్తం పది అంశాలు ఇస్లాంకి విరుద్ధమంటూ దారుల్ ఇఫ్తా వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







