జవాన్ల వల్లే దేశం..దేశం వల్లే మనం అంటున్నలతామంగేష్కర్
- October 21, 2017
నేడు భాయ్‌దూజ్(భగిని హస్త భోజనం). దీపావళి రెండో రోజు జరుపుకునే ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తుంటారు. 'భాయ్‌దూజ్'ను పురస్కరించుకుని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ భారత జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ప్రత్యేక వీడియో సందేశాన్ని పోస్టు చేశారు.
' భారత జవాన్లకు నమస్కారం. 'భాయ్‌దూజ్' శుభాకాంక్షలు. నేనూ మీ సోదరిమణుల్లో ఒకరినే. మీరంటే నాకు చాలా గౌరవం. మన జవాన్లు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. జవాన్ల వల్లే ఈ భారతదేశం ఉంది. భారతదేశం వల్లే మనమంతా ఉన్నాం. ఇది నిజం. దేశం కోసం పోరాడుతున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. వారికి నాదో విన్నపం.. నా నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే అడగండి, అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.' అని లతా మంగేష్కర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







