ఏపీ పోలీసులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం: డిజిపి

- October 21, 2017 , by Maagulf
ఏపీ పోలీసులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం: డిజిపి

ఏపి రాష్ట్రంలో పోలీసు సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు ప్రమాద బీమా కల్పించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 ఎకరాల్లో క్వార్టర్స్‌ నిర్మించి సిబ్బందికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు తప్పు చేసినట్లు తేలితే ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com