అజ్మాన్ సముద్రంలో గల్లంతైన పాకిస్తాన్ మత బోధకుడు
- October 21, 2017
అజ్మాన్: అజ్మాన్ లో పాకిస్తాన్ ఇమామ్ ( మత బోధకుడు) సముద్రంలో గల్లంతై మృతి చెందినట్లు మృతదేహం సముద్రం ఒడ్డున దొరికినట్లు నివేధిలు పేర్కొన్నాయి. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత వ్యక్తి నాలుగు రోజుల క్రితం రాస్ అల్ ఖైమా పోలీసు స్టేషన్ తప్పిపోయినట్లుగా ఒక పిర్యాదు సైతం చేయబడినట్లు వారు తెలిపారు. అజ్మాన్ పోలీసులు రాస్ అల్ ఖైమా పోలీసులను సంప్రదించారు. సముద్రంలో లభ్యమైన ఇమామ్ మృతదేహాన్ని గుర్తించడానికి మృతుని కుటుంబ సభ్యులను తీసుకువచ్చారు. ఎం. హెచ్.ఎస్ గా గుర్తించబడిన పాకిస్తాన్ ఇమామ్ మృతి వెనుక ఏ నేరపూరిత చర్య ఉందొ అనే అనుమానం కుటుంబసభ్యులు వ్యక్తం చేయడంతో ఈ అనుమానాస్పద మరణంపై పూర్తి విచారణ జరుగుతోంది. రాస్ అల్ ఖైమాలోని అల్ ధైట్ పొరుగు ప్రాంతంలో ఒక మసీదులో ఇమామ్ ( మత బోధకుడు) గా ఆయన పనిచేసేవాడు.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







