శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రేమపందెం' ఆడియో 29న విడుదల
- October 23, 2017
శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో శ్రవణ్, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్ వినోద్, కిరణ్ కళ్యాణ్, నరేష్, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను, పరిశ్రమను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన మా ‘ప్రేమపందెం’ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా అన్ని వర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. తాజాగా రెండు ట్రైలర్‌ను మీడియాకు విడుదల చేశాం. వెంకట్ ఎస్.వి.హెచ్. సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనె 29న విడుదల చేస్తున్నాం. యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌కు ఆడియో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే పాటల కంపోజింగ్ నుంచి చిత్రీకరణ వరకూ చాలా శ్రద్ధ తీసుకున్నాం అన్నారు.
దర్శకుడు ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ.. పోస్టర్స్ విషయంలో అందరూ అభినందను పుతుంటే సంతోషంగా ఉంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాు చేస్తున్నాం. మా సంగీత దర్శకుడు వెంకట్ ఎస్.వి.హెచ్. అద్భుతమైన స్వరాలoదించారు. ఖర్చు విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాు అన్నారు.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రవణ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకర్రావు, బస్టాప్ కోటేశ్వరరావు, సీనియర్ వినోద్, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదలగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు. ఈ చిత్రానికి మాటుల: ఓబుయ్య, ఎడిటింగ్: సంతోష్, సంగీతం: వెంకట్ ఎస్.వి.యు., రీరికార్డింగ్: మహీధన్, కొరియోగ్రఫీ: శామ్యూల్, కెమెరా: అమర్ జి., సహకారం శరత్‌సాగర్, కో ప్రొడ్యూసర్: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్: గణేష్ ముత్యాల. పి.ఆర్.ఓ: ‘సింహాసనం’ సురేష్, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









