కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 102 వ సినిమా 'జై సింహా'
- October 23, 2017
మ రొకసారి వెండితెరపై సింహావతారాన్ని ప్రదర్శించబోతున్నారు బాలకృష్ణ. స్వతహాగా నరసింహస్వామి భక్తుడైన ఆయనకి 'సింహా'తో కూడిన పేర్లు బాగా అచ్చొస్తుంటాయి. 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి', 'లక్ష్మీనరసింహా', 'సింహా'... ఇలా విజయాల్ని సొంతం చేసుకొన్నారు. అదే తరహాలో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న బాలకృష్ణ 102వ చిత్రానికి 'జై సింహా' అనే పేరును ఖరారు చేశారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నయనతార కథానాయిక.
హరిప్రియ, నటాషాదోషి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మాత. ఇటీవలే పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి 'కర్ణ', 'జయసింహ' తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే చిత్రబృందం 'జై సింహా' పేరును ఖరారు చేసింది. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







