ఐటీ రంగంలో శరవేగంగా దూసుకెళ్తున్న తెలంగాణ

- October 24, 2017 , by Maagulf
ఐటీ రంగంలో శరవేగంగా దూసుకెళ్తున్న తెలంగాణ

తెలంగాణలో ఐటీ రంగం శరవేగంగా దూసుకెళ్తోందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్ అన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఐటీ రంగంలో తెలంగాణ ఘననీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఐటీ నిపుణులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నారని, ఇటీవల ప్రపంచాన్ని వణికించిన పెట్యార్యాన్సమ్ వేర్ అనేక మాల్వేర్లను హైదరాబాద్ ఐటీ సంస్థలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. సోమవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కాన్‌క్వేల్-3 సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖకు ఇస్తున్న ప్రోత్సహకాలను గుర్తించాలన్నారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ రావలసి ఉండగా, క్యాబినెట్ సమావేశం ఉండడం వల్ల ఆయన రాలేకపోయారన్నారు. అయినప్పటికీ సమావేశానికి కేటిఆర్ అభినందనలు తెలిపారన్నారు. ఎస్సీఎస్సీ కౌన్సిల్ సెక్రటరీ భరణి అరోల్ మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ సమావేశం గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఐటీ సంస్థలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాలను నివారించాలంటే ఐటీ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎస్సీఎస్సీ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో పనిచేస్తుందన్నారు. ఈ సమావేశానికి ఐటీ కంపెనీలకు చెందిన 450 మంది నిపుణులు, 70 మంది సీనియర్ పోలీస్ అధికారులు, డెలాయిట్, ఈ అండ్ టి, కెపిఎంజి, డాక్టర్ రెడ్డీస్, సయెంట్, సిఏ టెక్నాలజీస్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులతోపాటు యూకె, యుఎస్‌ఏ, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ డెలిగేట్స్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com