100సీసీ సీసీ కన్నా తక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఇక పై ఒకే ఒక సీటు

- October 24, 2017 , by Maagulf
100సీసీ సీసీ కన్నా తక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఇక పై ఒకే ఒక సీటు

వంద సీసీ కన్నా తక్కువ యంత్ర సామర్థ్యాన్ని కలిగిన దిచక్ర మోటారు వాహనాలపై ఇక ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ఇద్దరు ప్రయాణిస్తే నేరమే! బండి చోదకుడి వెనుక మరొకరు కూర్చుని పయనించటం నిషిద్ధం. కర్ణాటక రవాణా శాఖ ఈ మేరకు సోమవారం ఉత్తర్వుల అమలుకు ఆదేశాలు జారీచేసింది. యంత్ర సామర్థ్యం 100సీసీ కంటే తక్కువ కలిగిన వాహనాలకు ఒకే ఒక ఆసనాన్ని(సీటు) బిగించాలనీ ద్విచక్ర మోటారు వాహన తయారీ సంస్థల్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఇప్పటికే తయారైన వాహనాలకు వర్తించదని రవాణాశాఖ ఉప కార్యదర్శి బీరేశ్‌ వెల్లడించారు. ఈ శాసనాన్ని ప్రభుత్వం చాలా కాలం కిందటే చేసింది. మారిన పరిస్థితుల్లో అనివార్యంగా ఇప్పుడు అమలు చేస్తున్నామని వివరించారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల వెనుక కూర్చున్న వారే ఎక్కువగా మరణిస్తున్నారు. మృతుల్లో మహిళలు, పిల్లల సంఖ్య మరీ ఎక్కువని అధ్యయనంలో తేలింది. అందువల్లే 100సీసీ కంటే తక్కువ సామర్థ్యాన్ని కలిగిన వాహనాలపై ఇద్దరి ప్రయాణాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఈ నియమం ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అమల్లో ఉంది.

మోపెడ్లు, స్కూటీ ఇంజిన్ల సామర్థ్యాలు 60సీసీ కంటే తక్కువగా ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తుల ప్రయాణం ప్రమాదాలకు దారితీస్తోందని బీరేశ్‌ తెలిపారు. చిన్న ప్రమాదాలకు కూడా ఈ వాహనాలు తట్టుకోజాలవన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com