రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే క్రిమినల్‌ చర్యలే

- October 24, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే క్రిమినల్‌ చర్యలే

మనామా: రోడ్డు ప్రమాదాల్ని కెమెరాల్లో బంధించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ, బిల్లుని అప్రూవ్‌ చేయడం జరిగింది. ఈ బిల్లులో సంబంధిత నేరాలకు 500 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించేలా వీలు కల్పించారు. మీడియా ప్రతినిథులు, అలాగే ప్రమాదాలకు గురైనవారిని మినహాయించారిక్కడ. ఫారిన్‌ ఎఫైర్స్‌, డిఫెన్స్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. ఆరు నెలలకు మించని జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్‌కి మించని జరీమానాను ఈ కేసుల్లో విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డవారు లేదా, తమవారిని కోల్పోయినవారు పడే వేదన చాలా తీవ్రమైనదనీ, అలాంటి ఘటనల్ని చిత్రీకరించి సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేయడం మానవత్వం అనిపించుకోదనీ, ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకురావాల్సి వస్తోందని ఎంపీ మొహమ్మద్‌ అల్‌ మారిఫి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com