బహ్రెయిన్‌లో శుక్రవారం మెగా మ్యూజికల్‌ నైట్‌

- October 24, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో శుక్రవారం మెగా మ్యూజికల్‌ నైట్‌

మనామా:కింగ్‌డమ్‌కి చెందిన కలాయా గ్రూప్‌ మెగా మ్యూజికల్‌ నైట్‌ని శుక్రవారం సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహించనుంది. ఇండియన్‌ క్లబ్‌ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వీట్‌ సమ్మర్‌ మెలోడీస్‌, ఇన్నిసై ఇరవు పేర్లతో ఇప్పటికే నిర్వహించిన షోస్‌ విజయవంతం కావడంతో, వాటిని మించి అత్యద్భుతంగా ఉండేలా ఈ మ్యూజికల్‌ నైట్‌ని ప్లాన్‌ చేశారు. పూర్నా కార్ప్‌ ఎస్‌పిసి సహకారంతో మెగా మ్యూజికల్‌ నైట్‌ని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్‌ ఛైర్మన్‌ అలాగే కలాయా ఫౌండర్‌ సత్యన్‌ లక్ష్మన్‌ చెప్పారు. ఈ ఈవెంట్‌కి 600 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రమోట్‌ చేసే దిశగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ఇన్విటేషన్‌ అందుకున్నవారు ఉచితంగానే హాజరు కావొచ్చు. 2002లో కలాయా ఏర్పాటయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com