ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ ఘర్షణలోఒక వ్యక్తి 4ఏళ్ళు గా కొబ్బరి చెట్టుపైనే
- October 25, 2017
మనిషి జీవితంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు చాలా ప్రభావితం చేస్తాయి. కొన్ని సంఘటనల ప్రభావంతో తిరిగికోలుకోలేని స్థితికి చేరిపోతారు. పిలిప్పీన్స్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ ఘర్షణలో గిల్‌బర్ట్ సాంఛేజ్ అనే వ్యక్తి తలపై ఎవరో తుపాకీతో కొట్టారు. దీంతో అతను అప్పటినుంచి తెలియని షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన తర్వాత గిల్‌బర్ట్ ఎవరో తనను చంపడానికి వస్తున్నారని, భయంతో వణికిపోతూ ఉన్నాడు. నేలపై ఉంటే ఎవరైనా వచ్చి తనను చంపేస్తారేమోనని భావించిన గిల్‌బర్ట్..ఇంటి పక్కనే తోటలో ఉన్న సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న కొబ్బరిచెట్టుపైకి ఎక్కాడు. 2014లో కొబ్బరిచెట్టు ఎక్కిన గిల్‌బర్ట్ అప్పటి నుంచి చెట్టుపైనే ఉండటం గమనార్హం. మూడేళ్లుగా కొబ్బరిచెట్టుపైన జీవితం గడుపుతున్న తన కొడుకును కిందకి దించేందుకు గిల్‌బర్ట్ తల్లి వినిఫ్రెదా సాంఛేజ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేసేదేమి లేక తన కొడుకును బతికించేకునేందుకు కింద నుంచే దుస్తులు, ఆహారంతోపాటు అతనికిష్టమైన సిగరెట్లను కూడా ప్రత్యేకంగా తయారుచేసిన రోప్ వే సాయంతో పైకి పంపిస్తూ కాలం గడుపుతున్నది. ఇక గిల్‌బర్ట్ తన తల్లి పంపించిన ఆహారాన్ని తింటూ కొబ్బరిచెట్టును ఇంటిలా మార్చేసుకున్నాడు. గిల్‌బర్ట్‌ను సురక్షితంగా కిందికి దింపాలని అతని కూతుళ్లు, భార్య, తల్లి ఎన్నిసార్లు బతిమాలినా ఫలించలేదు.
చివరగా అక్టోబర్ 11న 50 మంది సభ్యుల బృందం గిల్‌బర్ట్‌కు ఏమీ జరుగకుండా కొబ్బరిచెట్టుపై నుంచి ప్రాణాలతో దింపాలని నిర్ణయించుకున్నారు. వారంతా కలిసి మిషన్ సాయంతో చెట్టును నరికి..ఎట్టకేలకు గిల్‌బర్ట్‌ను సురక్షితంగా కాపాడారు. అయితే కిందికి వచ్చిన గిల్‌బర్ట్ చర్మంపై బొబ్బలు, పురుగుల కాట్లున్నాయి. కొబ్బరిచెట్టుపై పూర్తిగా వంగి కూర్చోవడం వల్ల అతని వెన్నెముక పూర్తిగా వంపు తిరిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.
మూడేళ్ల తర్వాత ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన గిల్‌బర్ట్, మానసికంగా మాత్రం చాలా కుదేలైన స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







