నవంబర్‌లో జుమైరా జూ మూసివేత

- October 26, 2017 , by Maagulf
నవంబర్‌లో జుమైరా జూ మూసివేత

50 ఏళ్ళుగా అందర్నీ ఆకట్టుకుంటోన్న దుబాయ్‌లోని జుమైరా జూ నవంబర్‌లో మూసివేయబడనుంది. దుబాయ్‌ సఫారీ ప్రాజెక్ట్‌ కోసం ఈ జూపార్క్‌ని మూసివేయనున్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో తొలిసారిగా ప్రత్యేక హంగులతో సఫారీ పార్క్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టబోతున్న కారణంగా ప్రస్తుతం ఉన్న జుమైరా పార్క్‌ని మూసివేయాల్సి వస్తోందని దుబాయ్‌ మునిసిపాలిటీ లీజర్‌ ఫెసిలిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఖాలిద్‌ అల్‌ సువైది చెప్పారు. కొత్త ప్రాజెక్ట్‌ ప్రాంగణంలోకి ప్రస్తుతం జుమైరా జూలో ఉన్న జంతువుల్ని తరలించనున్నట్లు ఆయన వివరించారు. దుబాయ్‌ సఫారీ ప్రాజెక్ట్‌ ఓపెనింగ్‌ అలాగే జుమైరా జూ మూసివేత సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నవంబర్‌ 5న ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమంలో ఉద్యోగులందర్నీ సన్మానించనున్నట్లు వెల్లడించారు అల్‌ సువైది. జూ క్లోజింగ్‌ సెర్మానీకి ప్రజలందరూ ఆహ్వానితులేనని, ఎలాంటి ప్రవేశ రుసుమూ వారికి ఉండబోదని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com