ఒన్ బెల్ట్ ఒన్ రోడ్‌కు ఇన్వెస్టర్లు ఝలక్.!
- October 27, 2017చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఒన్ బెల్ట్ ఒన్ రోడ్‌కు (ఓబీఓఆర్) ఇన్వెస్టర్లు ఝలక్ ఇచ్చారు. ప్రధానంగా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా ప్రతిపాదించింది.
చైనా ప్రతిపాదిత 68 దేశాల్లో 27 దేశాలకు బిలో ఇన్వెస్టిమెంట్ గ్రేడ్ (సాధారణ పెట్టుబడి)ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ వంటి 14 దేశాలకు సున్నా రేటింగ్‌ను ఇచ్చాయి. మరికొన్ని దేశాలు అత్యంత అవినీతికరమైనవిగా రేటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ కింద రహదారులు, రైల్వేలు, పోర్టులు, పవర్ గ్రిడ్లు, నిర్మించాలని.. ఇందుకు 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అవసరమవుతాయని మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. 2050 నాటికి భూమి సరిహద్దుల వరకూ ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ద్వారా విస్తరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఒబీఓఆర్‌ను తమ దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రేటింగ్ సంస్థలు పేర్కొన్న ఫైనాన్షియల్ రిస్క్ గురించి చైనాలోని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ