విమానాశ్రయాన్ని తలపిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లు

- October 27, 2017 , by Maagulf
విమానాశ్రయాన్ని తలపిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లు

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతోంది. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది.  ఒక్కో స్టేషన్‌కు సుమారు రూ. 60 కోట్ల ఖర్చు, 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యంత సుందరంగా హైదరాబాద్ మెట్రోస్టేషన్‌ను తీర్చి దిద్దారు. స్టేషన్‌లో అన్ని వర్గాల వారికి అనువుగా వుండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. వీల్‌చైర్‌లో వచ్చేవారు సులభంగా ప్లాట్‌ఫాంపైకి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంధులు సైతం ఎవరి సహాయం లేకుండానే రైలు వరకు చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని వేశారు. 

మరి కొద్ది రోజుల్లో నగర వాసుల్ని పలకరించబోతున్న మెట్రో రైలు, స్టేషన్లలోపల ఆధునిక హంగులతో చిన్న పాటి విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది. ఈ రైలు అత్యధికంగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు. ఇంకా అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. భద్రత కొరకు కోచ్‌లలో వీడియో కెమెరాలు, స్టేషన్‌లలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. గంటకు సుమారు 50వేల మంది ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. రద్దీ సమయాల్లో రెండు నుంచి ఐదు నిమిషాలకు ఒక రైలు ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. 
టికెట్ ధర కూడా రూ. 8నుంచి రూ.19ల వరకు నిర్ణయించారు. ప్రతి స్టేషన్‌ జంక్షన్‌కు బస్సుల ఏర్పాటు సౌకర్యాన్ని కల్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com