రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్
- October 27, 2017
నవంబర్ 1 నుంచి రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రస్ అల్ ఖైమా రూలర్ అలాగే సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెషన్ యానివర్సిరీ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైన ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ తరహా డిస్కౌంట్ ఎమిరేట్ పరిధిలోనే అత్యధికమైనదని చెప్పారు మేజర్ జనరల్ అలి అబ్దుల్లా. రెసిడెంట్స్పై ట్రాఫిక్ జరీమానాల బర్డెన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనీ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









