కష్టాల్లో భారత కుటుంబం, వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్
- October 28, 2017
ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. వెంటనే వారికి సాయమందించడంలో ముందుంటున్నారు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తాజాగా, మలేషియాలో పాస్‌పోర్ట్ పోగొట్టుకుని ఇబ్బంది పడిన ఓ భారతీయ కుటుంబానికి సహాయం చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నారు.
వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ఓ ట్వీట్ చేసింది.
వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ఓ ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్‌కు వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్... 'ఇది చాలా అత్యవసర విషయం.. దయచేసి దౌత్య కార్యాలయాన్ని తెరిచి భారతీయ కుటుంబానికి సహాయం చేయండి' అంటూ మలేషియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సుష్మా స్వరాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. కాగా, ఆ వెంటనే సదరు భారతీయ కుటుంబానికి సహాయం చేసి, సమస్యను పరిష్కరించినట్లుగా భారత దౌత్యకార్యాలయం నుంచి సమాధానం వచ్చింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







