రామ్ నెక్ట్స్ మూవీ కన్ఫామ్ అయ్యింది
- October 29, 2017
రామ్ నెక్ట్స్ మూవీ కన్ఫామ్ అయ్యింది. లవ్ స్టోరీస్ తో మంచి సక్సెస్ లు అందుకుంటోన్న ఈ ఎనర్జిటిక్ స్టార్, ఓ కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ కు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న రామ్, నెక్ట్స్ మూవీ కన్ఫామ్ చేశాడు. నేను శైలజ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన ఎనర్జిటిక్ స్టార్, ఎక్కువగా యూత్ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తూ బరిలో దిగుతున్నాడు. లవ్ స్టోరీస్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఇంపార్టెన్స్ తోనే లవర్ బాయ్ ఇమేజ్ ను సెట్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్ త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
త్రినాధ రావ్ నక్కిన సినిమా చూపిస్త మావా, నేను లోకల్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. లవ్, సెంటిమెంట్, యాక్షన్ అన్నింటిని మిక్స్ చేసి సినిమాలు తీస్తూ కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాంటి ఈ దర్శకుడితో రామ్ సినిమా చెయ్యబోతున్నాడు. అయితే రామ్ మాస్ మూవీస్ వైపు వెళ్లినప్పుడు పెద్దగా సక్సెస్ కాలేదు.
తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉన్న కందిరీగతో మాత్రమే మాస్ హిట్ కొట్టాడు. తర్వాత మాస్ మూవీస్ తో పెద్దగా ఇంప్రస్ చెయ్యలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు త్రినాధరావ్ నక్కిన దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రినాధ్ కమర్షియల్ మూవీస్ ను డీల్ చెయ్యడంలో సూపర్ అనిపించుకున్నాడు కాబట్టి, రామ్ మళ్లీ ఓ కమర్షియల్ హిట్ ను కిడ్డీలో వేసుకుంటాడని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమాలో త్వరలోనే పట్టాలెక్కబోతోంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!