ఎన్టీఆర్ బయోపిక్‌లో ట్విస్ట్‌

- October 29, 2017 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్‌లో ట్విస్ట్‌

యువరత్న నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఏకంగా మూడూ బయోపిక్‌లు తెరకెక్కిస్తుండడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రోల్‌లో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు దర్శకుడు తేజ నటీనటుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఎంపికలో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్టీఆర్ రోల్‌లో ఆయన తనయుడు బాలయ్య నటిస్తుండగా ఇప్పుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఓ రోల్‌కు ఎంపికయ్యాడు.

ఇంతకు కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో చేస్తోన్న రోల్ ఎవరిదో కాదు ఆయన తండ్రి నందమూరి హరికృష్ణదే కావడం విశేషం. ఈ వార్త నిజంగా నందమూరి అభిమానులకు శుభవార్తనే చెప్పాలి. ఇక కథలో కీలకమైన చంద్రబాబు నాయుడు రోల్ కోసం సీనియర్ నటుడు జగపతిబాబు పేరును పరిశీలిస్తున్నారట. గతంలో బాలయ్య లెజెండ్ సినిమాలో కూడా జగపతిబాబు విలన్‌గా మెప్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి నుంచి సెట్స్‌మీదకు వెళుతోన్న ఈ సినిమాలో కాస్టింగ్ పెద్ద సంచలనంగా మారింది. తెలుగు సినీ, రాజకీయ రంగాల్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకంపనలకు దారితీస్తుందో ? చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com