ఒక్కరోజు పైలట్‌ గా విమానం నడిపే అవకాశం దక్కించుకున్న అబుదాబీ బాలుడు

- October 29, 2017 , by Maagulf
ఒక్కరోజు పైలట్‌ గా  విమానం నడిపే అవకాశం దక్కించుకున్న అబుదాబీ బాలుడు

అబుదాబీ : కలలు కనండి ..వాటిని సాకారం చేసుకోండని దివంగత మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమూల్యమైన మాట ఆ బాలుడు బహుశా విన్నాడేమో ?   ఏక్ దిన్ కా సుల్తాన్ కావాలని ఆ బాలుడు కోరుకోలేదు..తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చమని ఆ బుడతడు ఏకంగా విమానయాన అధికారులనే అభ్యర్ధించాడు. ఏదో పెద్దవాళ్ళ ముందు మార్కులు కొట్టేయాలని ఈ బుడ్డోడు బురిడీ కొట్టిస్తున్నాడని భావించి అసలు విమానాలకు సంబంధించి కాక్ పీట్ కు సంబంధించి సాంకేతిక వివరాలు ఆ విమాన అధికారులు అడిగేరు..అబుదాబీ కి చెందిన ఆడమ్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానం..కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతికత వివరాలతో సహా గడ గడ చెప్పాడు. విమానాలకు సంబంధించిన పరిజ్ఞాన్నాన్ని గమనించి  ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది నోరు వెళ్ళబెట్టారు. తమ విమానయాన సంస్థలో ఆడమ్‌కు ఒక్కరోజు పైలట్‌గా ఉండే అవకాశాన్ని కల్పించారు. ఆడమ్‌ను ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ శిక్షణా కేంద్రానికి  పిలిచి.. పైలట్‌ యూనిఫాం ధరింపచేసి  ఎయిర్‌బస్‌ ఏ380కు ఒక్కరోజు సహాయ పైలట్‌గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్‌కు విమానం నడిపించడంలో పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్‌ సమెరె యాక్‌లెఫ్‌ ఆడమ్‌ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్‌వేస్‌ అధికారుల అనుమతితో  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో మంచి  పైలట్‌ అవుతాడని నెటిజన్లు ఆ బాలుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. . ఏ380 ఎయిర్‌బస్‌కు కెప్టెన్‌ అవ్వడమే ఆడమ్‌ జీవిత  ఆశయమట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com