హైదరాబాద్‌లో వైభ‌వంగా శ్రీనివాస క‌ళ్యాణం

- October 29, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో వైభ‌వంగా శ్రీనివాస క‌ళ్యాణం

హైదరాబాద్‌లోని వాస‌వీ క‌ళ్యాణ మండ‌పంలో శ్రీనివాస క‌ళ్యాణం వైభ‌వంగా జ‌రిగింది. శ్రీ త్రిదండి శ్రీమ‌న్నార‌య‌ణ రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి ప్ర‌త్యేక్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన ఈ క‌ళ్యాణ మ‌హోత్స‌వానికి జంట న‌గ‌రాల్లోని ఆర్య వైశ్యులు.. భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.  తిరుమల నుంచి వ‌చ్చిన వేద పండితులు శాస్త్రోక్తంగా దేవ‌దేవుని వివాహం క‌న్నుల పండుగ‌లా నిర్వహించారు. వేంక‌టేశ్వ‌ర క‌ళ్యాణం అనంతరం చిన్న జీయ‌ర్ స్వామి భ‌క్తుల‌నుద్దేశించి మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com