ఎసి రెస్టారెంట్లకు జిఎస్‌టిని తగ్గించాలని మంత్రుల బృందం నిర్ణయం
- October 29, 2017
కోటి రూపాయలు టర్నోవర్ దాటని తయారీదారులు, రెస్టారెంట్లకు జిఎస్‌టిని తగ్గించాలని మంత్రుల బృందం సూచించింది. కంపోజిషన్ పథకం కింద వీరికి ఒక్క శాతం పన్ను మాత్రమే విధించాలని సూచించింది. అస్సాం ఆర్థిక మంత్రి హైమంత బిస్వా శర్మ నేతృత్వంలోని మంత్రుల బృందం ఎసి, నాన్ ఎసి రెస్టారెంట్ల మధ్య జిఎస్‌టి వ్యత్యాసాన్ని తగ్గించాలని, కంపోజిషన్ పథకం పరిధి దాటిన రెస్టారెంట్లకు 12 శాతం పన్ను విధించాలని కూడా సూచించింది. గది అద్దె రూ.7,500 కంటే ఎక్కువ వున్న హోటళ్లకు 18 శాతం పన్ను విధించాలని తెలిపింది.
రూ. ఒక కోటి టర్నోవర్ దాటని తయారీదారులు, రెస్టారెంట్లు, వ్యాపారుల కోసం కంపోజిషన్ పథకాన్ని జిఎస్‌టి కౌన్సిల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గతంలో ఇది రూ. 75 లక్షల వరకూ వుండేది. ఈ నెల
1 నుంచి రూ. కోటికి పెంచారు. అలాగే అంతర్‌రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాపారం నిర్వహించేవారిని కూడా కంపోజిషన్ పథకానికి అనుమతించాలని మంత్రుల బృందం సూచించింది. ఈ పథకం కింద సుమారు 15 లక్షల వ్యాపారులను ఎంపిక చేశారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు నెలవారీగా పన్నులు చెల్లించాలి, అయితే ఈ పథకంలో వున్న వ్యాపారులు మూడు నెలలకొసారి మాత్రమే పన్నులు చెల్లించాలి. జులై నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్‌టిపై అనేక విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం