సోమాలియాలో ఆత్మాహుతి దాడి 25కు చేరిన మృతులు
- October 29, 2017
- జంట పేలుళ్లతో దద్దరిల్లిన హోటల్, 25కు చేరిన మృతులు
శనివారం నాడు సోమాలియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 25కు చేరినట్లు అధికారులు చెప్పారు. సోమాలియా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లాహీ ఫార్మాజో అతిధిగా హాజరు కావల్సిన కార్య క్రమం ప్రారంభం కావటానికి కొద్ది ముందు ఒక ఆత్మా హుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండ ిన కారుతో హోటల్లోకి దూసుకు వచ్చాడు. కొద్దిసేపటికే మరో కారుబాంబు పార్లమెంట్ పాత భవనం గేటు వద్ద పేలింది. ఈ రెండు దాడులకు తామే బాధ్యత వహిస్తు న్నట్లు సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్ షబా బ్ ప్రకటించింది. భారీ పేలుడు సామగ్రితో వున్న ముగ్గు రు అల్ షబాబ్ కార్యకర్తలు హోటల్లోకి ప్రవేశించారని, తరువాత వారిని భద్రతా దళాలు కాల్చిచంపాయని అల్షబాబ్ ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడిలో 25 మంది మరణించారని, మరో 30 మందికి పైగా గాయప డ్డారని పోలీసు అధికారులు చెప్పారు. దాడి జరిగిన సమయంలో హోటల్లో వున్న ప్రభుత్వ మంత్రితో సహా దాదాపు 30 మందిని పోలీసులు రక్షించినట్లు స్థానిక పోలీసులు వివరించారు. ఈ సమయంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయనారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







