అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది

- October 29, 2017 , by Maagulf
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది

మంచుకొండల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు సరుకులు తీసుకెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్యంగా కుప్పకూలడం వెనుక కారణాలు బయటపడ్డాయి. చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు..

అక్టోబర్ 6న ఉదయాన్నే 6 గంటలకు.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతానికి వెళ్లింది Mi 17 వీ ఫైవ్‌... హెలికాప్టర్‌. 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. కొండలపై ఉన్న సైనిక శిబిరాల దగ్గర కిరోసిన్‌ క్యాన్‌లను ప్యారాచూట్ల సాయంతో కిందకు విడిచింది. ఈ సమయంలో ఓ కిరోసిన్ క్యాన్ ప్యారాచూట్‌.. హెలికాప్టర్ టెయిల్‌ రూటర్‌కు తట్టుకుంది. దీంతో రూటర్‌ జామ్ అయ్యి.. హెలికాప్టర్‌ కిందకు కూలిపోయింది.

సాధారణంగా సరుకులను  కిందకు దించే సమయంలో హెలికాప్టర్‌ను ఓ ప్రాంతంలో నిలిపి కిందకు వేస్తుంటారు. కానీ.. తవాంగ్‌లో మాత్రం వేగంగా ముందుకు సాగుతూ క్యాన్‌లను కిందకు విసిరారు. వేగంగా గాలులు వీయడంతో.. ఓ ప్యారాచూట్‌.. హెలికాప్టర్‌ తోకకు తగలడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అంతా చూస్తుండగానే.. కొండల్లో కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com