నేడు సింగపూర్‌కు అమరావతి కోసం భూములిచ్చిన రైతులు
- October 29, 2017
అమరావతి అన్నదాతకు అద్భుత అవకాశం. రాజధానికి భూములిచ్చిన రైతులకు.. ప్రభుత్వం సింగపూర్ అభివృద్ధిని నేరుగా చూపించనుంది. రైతులను దశలవారీగా సింగపూర్ తీసుకెళ్లనుంది. ఇవాళ కొందరు రైతులు ఫ్లైట్ ఎక్కనున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు సింగపూర్ విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తోంది ప్రభుత్వం. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సింగపూర్ యాత్ర కూడా ఒకటి. దీనికోసం మొత్తం 29 గ్రామాల రైతుల నుంచి దరఖాస్తులు కోరగా కేవలం 122 మంది మాత్రం ముందుకొచ్చారు. మొదట్లో 100 మందిని మాత్రమే సింగపూర్ తీసుకెళ్లాలనుకున్నప్పటికీ మిగిలిన 22 మందిని కూడా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించడంతో దశలవారీగా అందరినీ తీసుకెళ్లనున్నారు సీఆర్డీఏ అధికారులు...మొదటి విడతగా సోమవారం 34 మంది రైతులు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు..రైతుల యాత్ర బస్సును సీఎం చంద్రబాబు సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు...సచివాలయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి నేరుగా సింగపూర్ కు వెళ్లనున్నారు...సింగపూర్ లో తెలుగుప్రజలు రైతులకు స్వాగతం పలకనున్నారు...
సింగపూర్ వెళ్లే రైతులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సమావేశమై పలు సూచనలు చేసారు...రైతులు సింగపూర్ లో ప్రతి అంశాన్ని కూలంకుశంగా పరిశీలించాలని చెప్పారు..ఏవైనా సందేహాలుంటే తమతో పాటు ఉండే సింగపూర్ ప్రతినిధులను అడిగి తెలుసుకోవాలని సూచించారు...సింగపూర్ అభివృద్ది చెందిన విధానాన్ని పరిశీలించి ఆయా గ్రామాల్లో ప్రజలందరికీ వివరించాలని తెలిపారు...ముఖ్యంగా అక్కడి ప్రజలు ఆదాయం ఎలా ఉంది, రైతులు ఎలా అభివృద్ది చెందుతున్నారో తెలుసుకోవాలన్నారు...సింగపూర్ లో నాలుగు రోజలు పర్యటన చేయనున్నారు రైతులు...ఏపీ నుంచి సీఆర్డీఏ ప్రతినిధులుగా రైతులు వెళ్తుండటంతో అక్కడి ఏర్పాట్లన్నీ సింగపూర్ ప్రభుత్వమే చూసుకుంటుంది. రాజధాని అభివృద్ధిలో తమను భాగస్వాములు చేస్తున్నందుకు సింగపూర్ వెళ్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!